తిరుమలలో లారెన్స్ కు ఎదురైనా చేదు అనుభవం

తిరుమలలో లారెన్స్ కు ఎదురైనా చేదు అనుభవం

Published on Apr 2, 2013 9:25 AM IST

Raghava_Lawrence11
కొరియో గ్రాఫర్ , డైరెక్టర్, హీరో లారెన్స్ కు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. తనకు జరిగిన ఈ చేదు అనుభవంపై ఆవేశంతో,భాదతో తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ప్రవర్తనపై మీడియాతో మాట్లాడాడు. లారెన్స్ ని ఎటువంటి మర్యాద లేకుండా తోసిపరేశారట. ‘ సిబ్బంది నాతో చాలా అమర్యాదగా ప్రవర్తించారు. నేను దేవుణ్ణి పూర్తిగా చూడకముందే నన్ను తోసేశారు. అలాగే వారు ఆడవారితో ప్రవర్తిస్తున్న తీరు భాగోలేదు, చిన్న పిల్లలన్న కానీస జ్ఞానం లేకుండా వారిని తోసేశారు. సెలబ్రేటినైన నా పరిస్థితే ఇలా వుంటే మరి సామన్యుని పరిస్థితి ఏంటి ? చాలా దూరం నుండి దేవుణ్ణి చూడడానికి వచ్చిన ప్రజలను ఇలా తోసేయడం ఏం భాగోలేదని ఈ విషయంపై వెంటనే అదికారులు తగిన చర్యలు తీసుకోవాలని’ అన్నాడు.
తిరుమలలో లారెన్స్ కు ఎదురైనా ఈ చేదు అనుభవం నిజంగా అన్యాయం. మీరేమంటారు ఫ్రెండ్స్ ?

తాజా వార్తలు