భారీగా విడుదలవుతున్న నందీశ్వరుడు

భారీగా విడుదలవుతున్న నందీశ్వరుడు

Published on Jan 12, 2012 12:09 PM IST

నందమూరి తారకరత్న హీరోగా నటించిన ‘నందీశ్వరుడు’ సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం 250 ప్రింట్స్ తో భారీగా విడుదల చేయబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 190 డిజిటల్ ప్రింట్స్, 60 సాధారణ ప్రింట్స్ తో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం ఈ నెల 15 న విడుదల కాబోతుంది. కన్నడంలో వచ్చిన ‘డెడ్లీ సోమా’ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో షీనా హీరోయిన్ గా నటించింది. అంజి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రభు సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు