పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. అందరూ ముందే అనుకున్నట్టు ఈ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే దిశగా దూసుకుపోతోంది. కానీ ఒక్క విషయం నిర్మాతలని బాధపడేలా చేస్తోంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం పైరసీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తోంది. ఎక్కడా ఈ సినిమాకి సంబదించిన పైరసీ డివిడి/సిడిలను బయటకి రానివ్వకుండా చూస్తోంది.
ఈ రోజు హైదరాబాద్ కె.పి.హెచ్.బి కాలనీలోని స్వప్న వీడియో అండ్ ఆడియో లైబ్రరీ షాప్ లో సుమారు 2300 డివిడిలను పట్టుకుంది. ఇలానే పైరసీ అమ్ముతున్న వారిని కొంతమందిని విజయవాడలో, మరికొన్ని ఏరియాల్లో పట్టుకున్నారు.
అలాగే ప్రొడక్షన్ టీం సినీ ప్రేమికులకు ఈ సినిమాని థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చెయ్యండి, పైరసీకి దూరంగా ఉండండని ప్రచారం చేస్తోంది. పవన్ కళ్యాణ్, సమంత హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.