మన టాలీవుడ్ నుంచి వచ్చి ఇప్పుడు ఇండియన్ సినిమానే ఏలే వాడిగా నిలిచాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తో వచ్చిన స్టార్డం ను అలా మైంటైన్ చేస్తూ తన వల్ల ఓ సినిమాను పాన్ ఇండియన్ క్రేజ్ వచ్చేలా మారాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న మూడు భారీ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేస్తున్న “ఆదిపురుష్” ఒకటి.
అయితే ఈ చిత్రంలో రాముని పాత్రకు గాను ప్రభాస్ ను రావణ పాత్రకు గాను సైఫ్ అలీ ఖాన్ లు చేస్తున్నారని దర్శకుడు ఎప్పుడో చెప్పేసిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన ఒక ఫ్యాన్ మేడ్ ఎడిట్ పోస్టర్ ను చూసి ఓంరౌత్ స్టన్ అయ్యిపోయాడు. అయితే అక్కడ నుంచి ఓంరౌత్ కు ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఒక ఛాలెంజ్ వచ్చినట్టే అని చెప్పాలి.
ఎందుకంటే ప్రభాస్ ను ఒక పీరియాడిక్ చిత్రంలో మ్యాచో బాడీలో అద్భుతంగా రాజమౌళి చూపించారు. ,వారి అలాంటిది ఇప్పుడు ఏకంగా రామునిగా కనిపించనున్నాడు. అంటే అందుకు ఎలాంటి బాడీను చూపించాలి. సో ఓంరౌత్ ముందు ప్రభాస్ లుక్ పట్ల మాత్రం మంచి ఛాలెంజ్ ఉందని చెప్పాలి. మరి ఓంరౌత్ డార్లింగ్ ను ఎలా చూపిస్తారో చూడాలి.