
అక్కినేని నాగార్జున, వీరభద్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భాయ్’ చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్లో షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ పూర్తి చేసుకుని జనవరి 18న చిత్ర యూనిట్ తిరిగి రానుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత ఫిబ్రవరి నుండి వైజాగ్లో రెండవ షెడ్యూల్ జరగనుంది. నాగార్జున, రిచా గంగోపాధ్యాయ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో సోను సూద్ కీలక పాత్రా పోషిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున చెల్లెలి పాత్ర కూడా కీలకం అని సమాచారం. ఈ చెల్లెలి పాత్రని ఒక ప్రముఖ నటి చేయనున్నట్లు సమాచారం. ఇంతకు ఈ భాయ్ ఎవరు అనేది సినిమా కథ. రెండు విజయాలతో ఊపు మీదున్న వీరభధ్రమ్ చేస్తున్న మూడవ సినిమా ఇది.