‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘భాయ్’ రీ రికార్డింగ్ కార్యక్రమాలు త్వరలో మొదలు కానున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. దేవీశ్రీ మరికొద్ది రోజుల్లో రీ రికార్డింగ్ పనులు మొదలు పెట్టనున్నాడు. ఇప్పటికే షూటింగ్ చాలా భాగం పూర్తయిన ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి ఈ చిత్ర ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియోని కూడా సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్నారు.
ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తోంది. కమర్షియల్ ఎంటర్టైనర్స్ తీయడంలో మంచి పేరున్న వీరభద్రం చౌదరి ఈ సినిమాకి డైరెక్టర్. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.