నాగార్జున తన తదుపరి సినిమా ‘భాయ్’ తో బిజీగావున్నారు . ఈ సినిమా ఆడియో ఇప్పటికే మార్కెట్ లోకి విడుదలవ్వాలిసివుంది. కానీ కొన్ని కారణాల వలన వాయిదాపడింది. అయితే ఎట్టకేలకు ఈ అక్టోబర్ 5 న ఆడియో విడుదల తేదిగా ప్రకటించారు
వరుసగా రెండు హిట్లను ఇచ్చిన వీరభద్రం చౌదరి ఈ సినిమాకు దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్. చెల్లలి సెంటిమెంట్ నేపధ్యంలో సాగాబోయే ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్ అందరినీ అలరించింది