కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘భాయ్’ సినిమా ప్రొడక్షన్ టీం ఆలోచించి పరిస్థితులను బట్టి ఆచితూచి అడుగెయ్యాలి అనే విదానాన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారు. ఈ చిత్ర ప్రొడక్షన్ టీంకి బాగా తెలిసిన వారు చెప్పున సమాచారం ప్రకారం ముందుగా ఈ సినిమాని సెప్టెంబర్ 20న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల గానీ లేదా వేరే పెద్ద సినిమాలు ఏమన్నా రిలీజ్ ఉంటే అక్టోబర్ 4న రిలీజ్ చేద్దామని మరో తేదీని రెడీగా పెట్టుకున్నారు.
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమాలో ఇంకా ఒక్క సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ పాటని సెప్టెంబర్ 3నుంచి షూట్ చేయనున్నారు. రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు. వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.