ఇంటర్వ్యూ : నిర్మాత రామాంజనేయులు జవ్వాజి – ‘భద్రకాళి’ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్

ఇంటర్వ్యూ : నిర్మాత రామాంజనేయులు జవ్వాజి – ‘భద్రకాళి’ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్

Published on Sep 17, 2025 2:00 AM IST

హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ సక్సెస్ తర్వాత లేటెస్ట్ పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌ ‘భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ విలేకరుల సమవేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రావడం ఎలా అనిపిస్తుంది?

విజయ్ ఆంటోనీ గారు నేను ఎప్పటినుంచో మంచి మిత్రులం. విజయ్ ఆంటోనీ ఫిలిం ఫ్యాక్టరీ, మా బ్యానర్ సర్వంత్ రామ్ క్రియేషన్స్ కలిపి కొన్ని మూవీస్ చేయాలని ప్రయాణం మొదలుపెట్టాం. మార్గాన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు భద్రకాళి సెప్టెంబర్ 19 రిలీజ్ కాబోతుంది. ఇటీవలే బూకి అనే సినిమాని మొదలుపెట్టాం. మలయాళం లో ఒక సినిమా చేస్తున్నాం. మా రెండు బ్యానర్స్ లో ఇంకొన్ని సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయి. మేము విజయ్ ఆంటోని గారు కలవడం వల్ల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాము. మా నుంచి వరుసగా సినిమాలు రాబోతున్నాయి.

భద్రకాళి ఎలా మొదలైంది?

డైరెక్టర్ అరుణ్ ప్రభు గారు కథ చెప్పారు. చాలా బాగుంది. డైరెక్టర్ గారు అంతకుముందు తీసిన రెండు సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. భద్రకాళి సినిమాకి అరుణ్ బాబు గారు ఒక బ్యాక్ బోన్. ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ప్రేక్షకులను ఆలోచింపచేసే అంశాలు కూడా ఉన్నాయి. సినిమా అంత అద్భుతానికి రావడానికి కారణం డైరెక్టర్ గారి విజన్.

ట్రైలర్ చూస్తే ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అనిపిస్తుంది? కథ ఎంత డిఫరెంట్‌గా ఉంటుంది?

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో హీరో గారు చేసిన క్యారెక్టర్ తో ఇప్పటివరకు ఎలాంటి సినిమా రాలేదు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇలాంటి హీరో క్యారెక్టర్ తో ఇప్పటివరకు సినిమా రాలేదు.

ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏమిటి?

చాలా ఆనందంగా అనిపించింది. మేము ఊహించిన దానికంటే సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమా మొదలైన రెండు నిమిషాల్లోనే ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. విజయ్ గారి క్యారెక్టర్స్ అన్నీ నేచురల్ గా ఉంటాయి. ఇందులో కూడా తన పాత్ర ఆడియన్స్ కి చాలా కనెక్ట్ అవుతుంది. పెద్ద బడ్జెట్ తో తీసిన సినిమా ఇది. డైరెక్టర్ గారి విజన్ కి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేశాం. డైరెక్టర్ గారికి క్రియేటివ్ గా ఫ్రీడమ్ ఇచ్చాము.

తెలుగులో చేస్తున్న సినిమాలు ఉన్నాయా?

తెలుగులో సత్యదేవ్ గారితో ఫుల్ బాటిల్ అనే సినిమా చేస్తున్నాం. అది కంప్లీట్ అయి రెడీగా ఉంది. నవంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు