‘సార్’ సినిమాలో హీరో ఫస్ట్ రవితేజ – వెంకీ అట్లూరి

‘సార్’ సినిమాలో హీరో ఫస్ట్ రవితేజ – వెంకీ అట్లూరి

Published on Oct 20, 2025 12:01 PM IST

భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ నుంచి రానున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’, మనదే ఇదంతా.. అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. అక్టోబర్ 3న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. దర్శకుడు వెంకీ అట్లూరి రవితేజతో ఓ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో, వెంకీ అట్లూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ధనుష్‌తో చేసిన ‘సార్’ సినిమా కోసం మొదట వెంకీ రవితేజను సంప్రదించాడట.

వెంకీ అట్లూరి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘కోవిడ్ కాలంలో, నేను రవితేజ అన్నకు ఫోన్ చేసి ‘సార్’ కథ గురించి చెప్పాను. కానీ, ఆయన ఆ సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాంతో, రవితేజ ప్లేస్ లోకి ధనుష్ వచ్చాడు’ అంటూ వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు. ఇక మాస్ జాతర సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు