ఇండియన్ సినిమా దగ్గర తెలుగు నుంచి వచ్చిన రెండు ఏ రేటెడ్ సినిమాలు భారీ వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. మరి ఈ చిత్రాలే ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి, మరొకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్. అయితే వీటిలో సలార్ కి థియేటర్స్ లో కంటే ఓటిటిలో వచ్చాక అనూహ్య రెస్పాన్స్ ని అందుకుంది.
దీనికంటూ డైలీ డోసేజ్ సలార్ అంటూ కూడా ఓ ట్రెండ్ కూడా ఉంది. ఆ రేంజ్ స్టాండర్డ్స్ ని సలార్ సెట్ చేసింది. కానీ ఆ ఛాన్స్ మళ్ళీ ఓజి కి ఉండేలా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఓజి లో కూడా మైండ్ బ్లాక్ అయ్యే సాలిడ్ మాస్ మూమెంట్స్, ఇంకా యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. సో వీటికి కూడా డెఫినెట్ గా ఓటిటిలో వచ్చాక గట్టి రెస్పాన్స్ ఉండి తీరుతుంది అని చాలా మంది పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
యువ దర్శకుడు సుజీత్ ఇచ్చిన వర్క్ కోసం డెఫినెట్ గా ఓటిటిలో వచ్చాక మరింత గట్టిగా వినిపిస్తుంది అని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా టైటిల్ కార్డు నుంచి మంచి హై మూమెంట్స్, థమన్ స్కోర్ ఇలా చాలానే సోషల్ మీడియాని సలార్ తరహా లోనే షేక్ చేస్తాయని వారి నమ్మకం. మరి ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది ఈ 23 తర్వాత తెలిసిపోతుంది.