‘అఖండ 2’.. లైట్ తీసుకున్నారా?

‘అఖండ 2’.. లైట్ తీసుకున్నారా?

Published on Oct 19, 2025 11:59 PM IST

Akhanda-2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. తన బ్లాక్ బస్టర్ హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఉన్నారు కానీ మేకర్స్ నుంచి ప్రాపర్ అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు కొంచెం డిజప్పాయింటింగ్ గానే ఉన్నారని చెప్పక తప్పదు. దీపావళి వస్తున్నా కూడా అప్డేట్స్ పరంగా ఎలాంటి ఉలుకు లేదు. ఫస్ట్ సింగిల్ పై కూడా ఊసు లేదు.

కానీ వెనుక మాత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయినప్పటికీ బాలయ్య అభిమానులు మాత్రం మేకర్స్ తీరుతో సినిమాకి సమయం దగ్గర పడుతున్నప్పటికీ వారు లైట్ తీసుకున్నారా అని అనుకుంటున్నారు. దీనితో కనీసం సోషల్ మీడియా టీం అయినా మినిమమ్ ఇంటరాక్షన్ లాంటివి అప్పుడప్పుడు అయినా చేస్తుంటే అభిమానులకి కూడా కొంచెం ఊపు వస్తుంది. సో వీటిపై మేకర్స్ దృష్టి సారించాల్సి ఉంది.

తాజా వార్తలు