‘మెగాస్టార్’తో వెంకీ కుడుముల సినిమా ?

‘మెగాస్టార్’తో వెంకీ కుడుముల సినిమా ?

Published on Oct 20, 2025 8:00 AM IST

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ – శ్రీలీల జంటగా నటించిన సినిమా రాబిన్ హుడ్. మార్చి 28, 2025 న ఈ సినిమా విడుదల అయింది. కానీ, ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకోలేదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఈ యంగ్ డైరెక్టర్ ఓ కథ రాశాడట. ఇది పక్కా కామెడీ మూవీ అని, ఓ ముదురు జంట ప్రేమలో పడి.. తమ పిల్లలకు తెలియకుండా తమ ప్రేమను ఎలా కొనసాగించారు ? లాంటి అంశాల చుట్టూ ఈ కథ సాగుతుందట. ఈ సినిమాలో మెగాస్టార్ ‘మధ్య వయస్కుడు’గా కనిపించబోతున్నాడు.

మెగాస్టార్ సరసన హీరోయిన్ అనుష్క లేదా త్రిష హీరోయిన్ గా నటించబోతుందట. ఐతే, ఈ వార్త పై ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. నిజానికి గతంలో కూడా ఈ కలయికలో సినిమా రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఎలాగూ మెగాస్టార్ కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి, వెంకీ సినిమాని కూడా త్వరలోనే పట్టాలెక్కిస్తారట. మరి ఈ సినిమా సాధ్యం అవుతుందో లేదో చూడాలి.

తాజా వార్తలు