ఓటిటి సమీక్ష: ‘మరణమాస్’ – తెలుగు డబ్ చిత్రం సోనీ లివ్ లో ప్రసారం

ఓటిటి సమీక్ష: ‘మరణమాస్’ – తెలుగు డబ్ చిత్రం సోనీ లివ్ లో ప్రసారం

Published on May 17, 2025 6:22 PM IST

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : మే 15, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : బాసిల్ జోసెఫ్, అనిష్మా, బాబు ఆంటోనీ, రాజేష్ మాధవన్ తదితరులు
దర్శకులు : శివ ప్రసాద్
నిర్మాతలు : టోవినో థామస్ ప్రొడక్షన్స్, రఫెల్ ప్రొడక్షన్స్, వరల్డ్ వైడ్ ఫిల్మ్స్
సంగీతం : జేకే
సినిమాటోగ్రఫీ : నీరజ్ రెవి
ఎడిటింగ్ : చమన్ చాకో

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఇటీవల ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మళయాళ చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ నటించిన డార్క్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం “మరణమాస్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

కేరళలోని ఎర్నాకులం ప్రాంతంలో ఒక సైకో కిల్లర్ వయసైన కొంతమందిని దారుణంగా చంపి వారి నోట్లో అరటి పండు పెట్టి మాయం అవుతూ ఉంటాడు. ఇలా బననా కిల్లర్ పోలీసులకి పెద్ద తలనొప్పిగా మారగా ఆ కేసు డీవైఎస్పీ విజయ్ రామచంద్రన్ (బాబు ఆంటోనీ) కి వెళుతుంది. ఇంకోపక్క ఈ కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ పెట్టుకుంటాడు. మరి ఆ టార్గెట్ ఎవరు? ఎందుకు వారిని బననా కిల్లర్ టార్గెట్ చేస్తున్నాడు? అతని బ్యాక్ స్టోరీ ఏంటి? ఈ అంతటిలో మోడల్ ల్యూక్ (బాసిల్ జోసెఫ్) కిల్లర్ గా ఎలా ఇరుక్కుంటాడు? ఇందులో నుంచి బయట పడతాడా? పోలీసులు అతన్ని పట్టుకుంటారా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

మళయాళ సినిమా నుంచి ఈ మధ్య కాలంలో ఎలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చాయో చాలామందికి తెలుసు. మరి వాటిల్లో ఇది కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఇది సీరియస్ గా కాకుండా కొంచెం ఫన్ గా మంచి డార్క్ కామెడీతో ఈ తరహా సినిమాలు ఇష్టపడేవారికి అక్కడక్కడా మంచి హాస్యాన్ని అందిస్తుంది.

సినిమాలో ఉన్న పాత్రలు వాటిని ఒకొకటిగా డెవలప్ చేస్తూ వెళ్లిన విధానం అలాగే వాటికి ఒక డీసెంట్ ఎండింగ్ లాంటివి కూడా ఈ చిత్రంలో బాగున్నాయి. అలాగే సైకో కిల్లర్ పై సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఇక వీటితో పాటుగా బాసిల్ జోసెఫ్ సహా హీరోయిన్ అనీష్మా ఇంకా సిజు సన్నీ, రాజేష్ మాధవన్ ఇలా ప్రతీ ఒక్కరూ డిఫరెంట్ రోల్స్ లో నాచురల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు.

బాసిల్, అనీష్మా ఫన్ మూమెంట్స్ కొన్ని చోట్ల భలే అనిపిస్తాయి. అంతే కాకుండా రాజేష్ మాధవన్ సైకో పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు బాగానే చేసేసారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో లైన్ బాగానే ఉంది కానీ ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ డార్క్ క్రైమ్ కామెడీ సినిమాగా అనిపించదు. కొన్ని మూమెంట్స్ వరకు మాత్రమే పర్వాలేదు అనిపిస్తుంది.

మంచి డార్క్ కామెడీని ఆశించేవారు ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే ఈ సినిమా విషయంలో డిజప్పాయింట్ అవ్వొచ్చు. అలాగే కథనం ఒకింత స్లోగా సాగుతుంది. దీనితో ఫాస్ట్ పేస్ ఉండే థ్రిల్లర్స్ కోరుకునేవారు కూడా నిరాశ పడొచ్చు.

అలాగే చాలా వరకు సన్నివేశాలు మరీ అంత ఎగ్జైటింగ్ గా ఏమీ ఉండవు. సో అలా ఓకే అనిపించే రేంజ్ లో సాగుతుంది. ఫన్ మూమెంట్స్ ని ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేసి ఉంటే మరింత ఫన్ జెనరేట్ అయ్యి ఉండేది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, యాక్షన్ డిజైన్, అన్ని వర్గాల పని తీరు బాగుంది. ఎడిటింగ్ లో ఇంకొంచెం ఫాస్ట్ గా కథనం కట్ చెయ్యాల్సింది.

ఇక దర్శకుడు శివ ప్రసాద్ విషయానికి వస్తే తాను డీసెంట్ వర్క్ అందించారు అని చెప్పొచ్చు. పలు పాత్రలు వాటికి ముగింపు బాగానే ఉంది కానీ ఈ క్రమంలో కథనం మరికాస్త ఎంగేజింగ్ గా నడిపించి ఉంటే ఈ చిత్రం చూసే వీక్షకుడికి బెటర్ ఫీల్ కలిగి ఉండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘మరణమాస్’ చిత్రంలో డిఫరెంట్ క్రైమ్ యాంగిల్ కనిపిస్తుంది. అలాగే లీడ్ నటీనటులు బాగా చేశారు. దర్శకుడు ప్లాన్ చేసుకున్న కొన్ని అంశాలు బాగా డెలివర్ చేశారు. కానీ ఓవరాల్ గా మాత్రం ఒక ఫుల్ ఫ్లెడ్జ్ డార్క్ కామెడీ ఎంటర్టైనర్ లా ఇది అనిపించదు. కొన్ని పార్ట్స్ వరకు ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు