‘మార్క్’ ఇంట్రో: మరో సాలిడ్ యాక్షన్ తో వస్తున్న కిచ్చా సుదీప్!

‘మార్క్’ ఇంట్రో: మరో సాలిడ్ యాక్షన్ తో వస్తున్న కిచ్చా సుదీప్!

Published on Nov 8, 2025 9:00 AM IST

కన్నడ స్టార్ హీరోస్ లో మన తెలుగు ఆడియెన్స్ లో ఎప్పుడో ముద్ర వేసుకున్న టాలెంటెడ్ హీరోనే కిచ్చా సుదీప్. అయితే సుదీప్ నుంచి ఈ మధ్య కాలంలో సాలిడ్ యాక్షన్ డ్రామాలు వస్తున్నాయి. మరి గత ఏడాదిలోనే మ్యాక్స్ అనే సినిమా యాక్షన్ సినిమా లవర్స్ కి మంచి ట్రీట్ ఇచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత తాను చేస్తున్న అవైటెడ్ సినిమానే “మార్క్”. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ ఒకటి మార్క్ ఇంట్రోగా వచ్చింది.

అయితే ఈ టీజర్ మాత్రం లోకేష్ కనగరాజ్ స్టైల్ యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తుంది అని చెప్పాలి. సుదీప్ ని మంచి స్టైలిష్ యాక్షన్ లో చూపిస్తూ మాస్ ఆడియెన్స్ కి తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చే విధంగా దర్శకుడు విజయ్ కార్తికేయ డిజైన్ చేసారని చెప్పాలి. అలాగే ఈ ఇంట్రోలో అజనీష్ లోకనాథ్ ఇచ్చిన స్కోర్ కూడా సీన్స్ ని మరింత ఎలివేట్ చేసింది అని చెప్పవచ్చు. ఇలా మరోసారి సుదీప్ సాలిడ్ యాక్షన్ ఫ్లిక్ తో రాబోతున్నారని రాబోతున్నారని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి పాన్ ఇండియా రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ కావాల్సి ఉంది.

తాజా వార్తలు