మత్తు వదలరా, మత్తు వదలరా 2 వంటి కల్ట్ హిట్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రితేష్ రాణా తన నాలుగో చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. క్లాప్ ఎంటర్‌టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను చిరంజీవి(చెర్రీ), హేమలత పెడమల్లులు నిర్మిస్తుండగా, నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు.
మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఆమె స్టైలిష్, షార్ప్ పాత్రలో నటించనుండగా, సత్య హీరోగా నటిస్తున్నాడు. వెన్నెల కిషోర్, అజయ్ తమ పాత్రలతో తిరిగి వస్తున్నారు. ఇటీవల జరిగిన పూజా కార్యక్రమంతో చిత్రం అధికారికంగా ప్రారంభమైంది.
కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ సరంగం సినిమాటోగ్రఫీ, కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్, నార్నీ శ్రీనివాస్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రితేష్ రాణా స్టైల్‌లో వినూత్న హాస్యం, క్రేజీ ట్విస్టులతో ఈ చిత్రం రాబోతోందని చిత్రబృందం చెబుతోంది.


