బండ్ల గణేష్ కి డైమండ్స్ అంటే అత్యంతఇష్టం .!

ganesh-babu

‘గబ్బర్ సింగ్’ సక్సెస్ తో టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. కొంత కాలం క్రితం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి డైమండ్స్ పొదిగిన జిప్పో లైటర్ ని బహుమతిగా ఇచ్చారు. బండ్ల గణేష్ ‘బాద్ షా’ టైటిల్ లోగోని ఈ రోజు విడుదల చేసారు. ఈ టైటిల్ మొత్తం డైమండ్స్ తో డిజైన్ చేయబడి ఉంటుంది.

ఇది చూసిన తర్వాత అందరూ బండ్ల గణేష్ కి డైమండ్స్ అంటే బాగా ఇష్టమా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ విషయం పై ఇండస్ట్రీలో ఆరా తీస్తే అవుననే అంటున్నారు. బండ్ల గణేష్ ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో చేస్తున్న ‘బాద్ షా’, అల్లు అర్జున్ తో చేస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.

Exit mobile version