నందమూరి బాలకృష్ణ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకత ఉంది. ఎవరన్నా డైరెక్టర్ సినిమా కాన్సెప్ట్ తో తనని మెప్పిస్తే సినిమాలో సీన్స్ కోసం బాలకృష్ణ ఎలాంటి రిస్క్ అయినా చేస్తాడు. అలాంటి విషయమే లెజెండ్ సినిమా విషయంలో జరుగుతోంది. ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ లెజెండ్ సినిమా కోసం డేర్ మరియు రిస్క్ తో కూడుకున్న ఫైట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ యాక్షన్ సన్నివేశాలన్నిటినీ బాలయ్య ఎలాంటి డూప్ లేకుండా చేస్తున్నారు. అలాగే బాలయ్య ఈ సినిమాకోసం బరువు కూడా తగ్గనున్నారు.
రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు విలన్ పాత్రలో కనిపించనున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వారాహి చలన చిత్రం బ్యానర్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. మొదటి సారి బాలకృష్ణ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.