‘అఖండ 2’.. హిందీలో కూడా బాలయ్యే.!

akhanda 2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం అందులోని సీక్వెల్ సినిమానే “అఖండ 2”. దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ తర్వాత వస్తున్న నాలుగో సినిమా ఇది కాగా దీనికి మరింత శ్రద్ధతో వర్క్ చేసుకుంటున్నారు. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మరో కిక్కిచ్చే న్యూస్ వినిపిస్తుంది. దీని ప్రకారం బాలయ్య తెలుగు వెర్షన్ సహా హిందీ డబ్బింగ్ కూడా తానే చెప్పుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఆల్రెడీ తెలుగు డబ్బింగ్ దాదాపు కంప్లీట్ చేయగా ఈ తర్వాత హిందీ డబ్బింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ టైం భగవంత్ కేసరి సినిమాకి బాలయ్య హిందీ డబ్బింగ్ చెప్తే దానికి నార్త్ ఆడియెన్స్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అఖండ 2 కి అంతకు మించిన డోస్ అండ్ రెస్పాన్స్ ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. ఇవి పక్కన పెడితే అభిమానులు మేకర్స్ నుంచి రిలీజ్ డేట్ క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు.

Exit mobile version