షూటింగ్ ఫిక్స్ చేసిన బాలయ్య !


బాలయ్య బాబు హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా సెప్టెంబర్ 14 నుండి షూటింగ్ కి రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. దర్శకనిర్మాతలు కొన్నాళ్లు ఆగుదాం అంటున్న.. పర్వాలేదు స్టార్ట్ చేద్దామంటూ మొత్తంమీద బాలయ్య షూటింగ్ కి డేట్స్ కూడా ఇచ్చేశాడట. రామోజీ ఫిల్మ్ సిటీలోని విలేజీ సెట్ లో షూట్ స్టార్ట్ కానుంది. గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఈ సీన్స్ లో బాలయ్య పంచె కట్టులో కనిపిస్తాడట. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. అన్నట్టు ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. ఇప్పటికే ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసామని.. సరైన టైమ్ లో వాళ్లలో ఒకరిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంకా హీరోయిన్ పేరును ఎనౌన్స్ చేయలేదు.

Exit mobile version