బాలయ్య బాబు హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా సెప్టెంబర్ 16 నుండి షూటింగ్ కి రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు చేయబోతున్నది యాక్షన్ సీక్వెన్స్ అట. ఈ సీక్వెన్స్ ను మొదట వారణాసిలో విస్తృతంగా షూట్ చేద్దామనుకున్నారని.. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ షూట్ చేయడం కుదరుదు కాబట్టి… ఇప్పుడు ఈ సీక్వెన్స్ ను యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నేపథ్యంలో షూట్ చేస్తారట.
కాగా ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. అన్నట్టు ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు.