సీనియర్ హీరోయిన్ తో బాలయ్య ఫ్యామిలీ సాంగ్ ?

సీనియర్ హీరోయిన్ తో బాలయ్య ఫ్యామిలీ సాంగ్ ?

Published on Sep 5, 2020 7:36 PM IST


నందమూరి బాలకృష్ణ పక్కన సీనియర్ హీరోయిన్ మీనా నటించబోతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న యాక్షన్ సినిమాలో సీనియర్ బాలయ్యకు భార్య పాత్ర ఉందని.. ఆ పాత్రలోనే మీనాని తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బోయపాటి సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కి కూడా ఒక ఫ్యామిలీ సాంగ్ కూడా ప్లాన్ చేశాడట. బాలయ్య మీనాల మధ్య ఫ్యామిలీ సాంగ్ అంటే బాగానే వర్కౌట్ అవుతుంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది. అలాగే ఆ మధ్య ఒక నిమిషానికి పైగా వచ్చిన టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ దుమ్ము రేపే యాక్షన్ తో రెచ్చిపోయారు. ముఖ్యంగా పంచ కట్టులో బాలయ్య లుక్ కేకగా ఉంది. వైట్ అండ్ వైట్ లో బాలయ్య చక్కగా సరిపోయారు. సినిమాలో కూడా బాలయ్య అదే లుక్ తో కనిపిస్తారట.

ఇక బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి సూపర్ విజయాలను అందించారు బోయపాటి. కాబట్టి ఈసారి కూడా సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు