బాలయ్య మోస్ట్ అవైటెడ్ సినిమా టైటిల్ అప్పుడేనా.?

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తన ఆల్ టైం హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంపై ఎన్ని అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం విడుదల తేదీని కూడా మేకర్స్ ఇటీవలే ప్రకటించేసారు కానీ టైటిల్ ను మాత్రం ఇంకా గోప్యంగానే ఉంచారు. కానీ ఇప్పుడు ఈ టైటిల్ ఎప్పుడు రివీల్ చేస్తారో అన్నదానికి సంబంధించి బజ్ ఒకటి వినిపిస్తుంది.

ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా టైటిల్ ను మేకర్స్ వచ్చే మార్చ్ 11న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదల చెయ్యనున్నట్టు వినికిడి. ఇప్పటికే ఈ సినిమాకు టైటిల్ గా “మోనార్క్” అనే క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేసారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version