నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన బ్లాక్ బస్టర్ హిట్స్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘అఖండ 2 తాండవం’. పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ ని సెట్ చేసుకుంది. మరి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతూ ఉండగా బోయపాటి పలు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తూ సినిమాని పరుగులెత్తిస్తున్నారు.
అయితే ప్రస్తుతం నదీ ప్రవాహం వద్ద కీలక సన్నివేశాలు ప్లాన్ చేస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలయ్య అంత వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి వెళ్లి కూడా సీన్ ని చేసినట్టు తెలుస్తుంది. ఇలా మొత్తానికి మాత్రం షూటింగ్ నిర్విరామంగా కొనసాగుతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.