‘బాలయ్య – బి గోపాల్’లది సూపర్ హిట్ కాంబినేషన్. బాలయ్య కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ సినిమాలు బి గోపాల్ డైరెక్ట్ చేసినవే. కాగా
బాలయ్య బాబు – బి.గోపాల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే పూర్తి చేసుకుందట. ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ రాస్తున్నారు.
ఈ సినిమాలో బాలయ్య ఏజ్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. బాలయ్య శైలిలోనే సినిమా సాగుతూ కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. కరోనా తగ్గిన వెంటనే షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ జూన్ 10న బాలయ్య పుట్టినరోజున నాడు అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
కాగా బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే పూరితో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.