బాలయ్యతో ఎన్.టి.ఆర్ ఫ్రెండ్ సినిమా చేయనున్నాడా?

బాలయ్యతో ఎన్.టి.ఆర్ ఫ్రెండ్ సినిమా చేయనున్నాడా?

Published on Nov 19, 2012 12:51 PM IST


ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ త్వరలోనే శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాని జూ. ఎన్.టి.ఆర్ స్నేహితుడు మరియు అసోషియేట్ అయిన వల్లభనేని వంశీ మోహన్ నిర్మిస్తుండడం విశేషం. గతంలో ‘లక్ష్యం’ సినిమా తీసిన శ్రీవాస్ బాలకృష్ణతో చేస్తున్న ఈ సినిమా పొలిటికల్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. మెల్ల మెల్లగా రాజకీయాల్లోకి అడుగులేస్తున్న బాలకృష్ణ తను చేసే సినిమాలు కూడా అదే కోవకి చెందినవిగా మరియు మాస్ లుక్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

తాజా వార్తలు