బాలకృష్ణ ,నయనతార మళ్ళి కలుస్తున్నారా?

బాలకృష్ణ ,నయనతార మళ్ళి కలుస్తున్నారా?

Published on Apr 14, 2012 7:51 PM IST

తాజా పుకారు కనుక నిజమయితే “శ్రీ రామ రాజ్యం” చిత్రంతో మైమరిపించాక బాల కృష్ణ మరోసారి నయనతారతో కలిసి నటించనున్నారు. బాల కృష్ణ కొన్నేళ్ళ క్రితం నిలిచిపోయిన తన కలల చిత్రం “నర్తనశాల” చిత్రాన్ని తిరిగి మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అప్పట్లో ప్రధాన పాత్ర సౌందర్య చెయ్యాల్సి ఉంది ఆవిడ మరణించాక ఈ చిత్రాన్ని నిలిపివేశారు. “శ్రీ రామ రాజ్యం” చిత్రంలో నయనతార నటన నచ్చి బాలకృష్ణ ద్రౌపది పాత్ర గురించి ఆమెతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. శ్రీ రామ రాజ్యం నిర్మాత యలమంచలి సాయి బాబా ఈ చిత్రాన్ని నిర్మించాబోతున్నట్టు తెలుస్తుంది. అన్ని సరిగ్గా జరిగితే బాలకృష్ణ అభిమానులకు పండగే. చూద్దాం ఈ పుకార్లు నిజమవుతాయో లేదో.

తాజా వార్తలు