దుబాయ్ లో సందడి చేస్తున్న బాలయ్య ‘లెజెండ్’ టీం

దుబాయ్ లో సందడి చేస్తున్న బాలయ్య ‘లెజెండ్’ టీం

Published on Feb 3, 2014 6:16 PM IST

Legend_First_Look1
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’. కొద్ది రోజుల క్రితం వరకూ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం అంతా ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. అక్కడ సినిమాలోని రెండు పాటలను, రెండు యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు కొన్ని కీలకమైన సీన్స్ ని షూట్ చేయనున్నారు. దానితో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుంది.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మొదటి సారి బాలకృష్ణకి మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో వారాహి చలన చిత్రం – 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మార్చి చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు