నటసింహం నందమూరి బాలకృష్ణ ‘అధినాయకుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం మహా శివరాత్రి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లక్ష్మి రాయ్ మరియు సలోని హీరోయిన్లుగా నటిస్తుండగా బాలకృష్ణ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు.
పరుచూరి మురళి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎమ్మెల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా తెరకెక్కుతున్న అధినాయకుడు చిత్రానికి కళ్యాణి మాలిక్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.