నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నానక్రాంగూడా సమీపంలో జరుగుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రాధిక ఆప్టే మరియు సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు.
ఈ సినిమా మేకర్స్ ఈ సినిమాని 2014 మొదట్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. బహుశా ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే అవకాశం ఉంది. జగపతి బాబు నెగటివ్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో పలువురు సీనియర్ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు – సాయి కొర్రపాటి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ఫుల్ గా, స్టైలిష్ గా కనిపించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.