హైదరాబాద్లో జరిగిన బాలకృష్ణ కొత్త సినిమా ముహూర్తం కార్యక్రమం

హైదరాబాద్లో జరిగిన బాలకృష్ణ కొత్త సినిమా ముహూర్తం కార్యక్రమం

Published on Jun 3, 2013 1:00 PM IST

Balakrishna-and-boyapati
నందమూరి బాలకృష్ణ నటించనున్న సినిమా ముహూర్తం కార్యక్రమాలు ఈ రోజు హైదరాబాద్లో జరిగాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వస్తున్న ఈ సినిమా ముహూర్తం కార్యక్రమాలు ఉదయం గంటలు11:57 నిమిషాలకు జరిగింది. ఈ సినిమాని సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి బ్యానర్లో14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు నుండి మొదలయ్యే అవకాశం ఉంది. బాలకృష్ణ ఫాన్స్ కోసం ఈ సినిమా సెలబ్రేషన్స్ ని జూన్ 10న నిర్వించడానికి సినిమా ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ కొత్త అవతారంలో పవర్ ఫుల్ గా కనిపించనున్నడని సమాచారం. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ ని, మ్యూజిక్ డైరెక్టర్ ని ఫైనలైజ్ చేయవలసి ఉంది. ఈ విషయాలను త్వరలో తెలియజేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు