‘సింహా’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలయ్యకి పోటీ ఇచ్చే విలన్ పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా బాలయ్య – జగపతి బాబులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ నుంచి అభిమానులు ఏమేమి కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం చెబుతోంది.
ఇద్దరు హీరోయిన్స్ ఉండే ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఒక హీరోయిన్ గా ఎంపిక కాగా మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. బాలకృష్ణ రేడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వారాహి చలన చిత్ర సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.