అఘోరా యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య !

అఘోరా యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య !

Published on Feb 8, 2021 2:35 PM IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న యాక్షన్ సినిమాకి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతుంది. కాగా, ఈ సన్నివేశాల్లో బాలయ్య అఘోరా గెటప్ లో కనిపించబోతున్నాడు. అంటే.. బాలయ్య తన స్టైల్ ను పూర్తిగా మార్చాలనుకుంటున్నాడట. ముఖ్యంగా తానూ చేసే యాక్షన్ విషయంలో బాలయ్య మార్పు చూపించాలనుకుంటున్నాడట. అందుకే రెగ్యులర్ యాక్షన్ ఈ సీక్వెన్స్ లో అస్సలు ఉండదట.

కాగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు కూడా బాలయ్య అభిరుచికి తగ్గట్లు యాక్షన్ లో కొత్తదనం పెడుతున్నారట. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండగా ప్రధాన ప్రతినాయకుడు ఎవరనేది ఇంకా బయటపెట్టలేదు టీమ్. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు