‘శివ పుత్రుడు’ నుంచి ‘సెవెంత్ సెన్స్’ వరకు సూర్య తను చేసిన సినిమాలతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. తను ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం కోసం ట్రై చేస్తూఉంటాడు. ఇటీవలే జరిగిన ‘బ్రదర్స్’ ఆడియో వేడుకలో ఈ చిత్ర దర్శకుడు కె.వి ఆనంద్ మాట్లాడుతూ ‘ సూర్య నటించేటప్పుడు అసలు అలిసిపోడు, ఎన్ని టేకులైనా చేస్తానంటాడు’ అని అన్నారు. ఈ విషయం గురించి సూర్య మాట్లాడుతూ “ఈ విషయంలో ఎక్కువ భాగం నా దర్శకుడు బాల గారికి క్రెడిట్ చెందాలి. నేను ఆయనతో పనిచేసినప్పుడు ఆయన నాకు ‘ సూర్య మనం చేసే సినిమా మనం చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటుంది. మీ నటనలో పరిపక్వత రావాలంటే ఎప్పుడూ తప్పు చేయకూడదు అనే భావనతో ట్రై చేయండి. మీరు ఇంకో టేక్ చేస్తున్నారు అంటే దాన్ని ఆ సీన్ ని ఇంకా మెరుగు పరుచుకోవడానికి ట్రై చెయ్యండి అని’ బాల అన్నారు. అప్పటి నుంచే నేను 16 – 17 టేకులు చేసినా బోర్ అనిపించదు, ఇంకా చేయమన్నా చేస్తాను అని” ఆయన అన్నారు. సూర్య అవిభక్త కవలలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించారు. బెల్లం కొండ సురేష్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ చిత్రానికి హారీష్ జైరాజ్ సంగీతం అందించారు.
నాకు ఆ విషయం ఆయనే నేర్పాడు : సూర్య
నాకు ఆ విషయం ఆయనే నేర్పాడు : సూర్య
Published on Oct 7, 2012 8:26 PM IST
సంబంధిత సమాచారం
- హీరో విశాల్ ఎంగేజ్మెంట్.. పుట్టినరోజే గుడ్ న్యూస్ షేర్ చేసాడుగా
- చిరు కోసం సైకిల్ యాత్ర చేసిన మహిళా వీరాభిమాని.. మెగాస్టార్ భరోసా
- హిస్టరీ క్రియేట్ చేసిన రామ్ సింపుల్ పోస్ట్!
- తెలుగులో దుల్కర్ ‘కొత్త లోక’ మార్నింగ్ షోస్ క్యాన్సిల్!
- స్ట్రాంగ్ బజ్: ‘ఓజి’ కోసం పవన్ మరోసారి!?
- ట్రైలర్ తర్వాత ‘మిరాయ్’ పై మరిన్ని అంచనాలు!
- ‘ఓజి’ ఫీవర్.. యూఎస్ మార్కెట్ ని టేకోవర్ చేస్తున్న పవర్ స్టార్!
- ‘విశ్వంభర’ కోసం ఈ ఓటీటీ సంస్థ?
- ఘట్టమనేని హీరో కోసం విలన్‌గా మారిన మోహన్ బాబు..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!
- ‘బిగ్ బాస్ 9’: మొత్తానికి కొత్త సీజన్ లాంచ్ డేట్ వచ్చేసింది!
- అఫీషియల్: ‘ది రాజా సాబ్’ మళ్ళీ వాయిదా.. కొత్త డేట్ వచ్చేసింది!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- అఖండ 2 తప్పుకోవడంతో సింగిల్‌గా దిగుతున్న ఓజి.. ఇక రికార్డులు గల్లంతే..!
- వీడియో : మిరాయ్ ట్రైలర్ (తేజ సజ్జా, మంచు మనోజ్)