మాస్కులతో “బాహుబలి 2” క్లైమాక్స్ షాట్..!

మాస్కులతో “బాహుబలి 2” క్లైమాక్స్ షాట్..!

Published on Jun 26, 2020 2:46 PM IST

ప్రస్తుతం ఊహించని గెస్ట్ కరోనా దెబ్బకు ప్రతీ ఒక్కరి జీవితంలోనూ మాస్కు తప్పనిసరి అయ్యిపోయింది. కానీ కొంతమంది మాత్రం అవేవి లెక్క చేయడం లేదు. అలాంటి వారికి అర్ధమయ్యే రీతిలోనే పలువురు అవగాహనా కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అలా అవగాహన కల్పించేందుకు ఇద్దరు యానిమేటర్ మరియు వి ఎఫ్ ఎక్స్ మేకర్స్ మన దేశ వ్యాప్తంగా తెలిసిన ఏకైక సినిమాను ఎంచుకున్నారు.

అదే మన తెలుగు సినిమా “బాహుబలి 2”. దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు మన టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రాణాలతో చేసిన ఏఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గరే భారీ హిట్ అయ్యింది. ఇలాంటి ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక ఐకానిక్ షాట్ ను వారు ఎన్నుకొని ఎడిట్ చేసి సెట్ చేసారు.

బాహుబలి 2 క్లైమాక్స్ లో రానా మరియు ప్రభాస్ ల మధ్య భీకర పోరాట సన్నివేశం తర్వాత చితిపై ఒక సీన్ ఉంటుంది. రానా దగ్గరకు ప్రభాస్ అలా ముందుకు వస్తాడు. ఇదే షాట్ ను రాజమౌళి ట్రైలర్ లో కూడా కట్ చేసారు.

ఇప్పుడు ఈ షాట్ లో ప్రభాస్ మరియు రాణాలకు అవినాష్ కనల్ కన్నన్ మరియు లాజీజాక్సన్ గనియెవ్ అనే ఇద్దరు వి ఎఫ్ ఎక్స్ మేకర్స్ వారి టీమ్ తో గ్రాఫికల్ మాస్క్ లు చాలా రియలిస్టిక్ గా అర్రెంజ్ చేసారు. దీనితో రాజమౌళియే వారిని గుడ్ జాబ్ అంటూ మెచ్చుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు