ప్రీ ప్రొడక్షన్ పూర్తిచేయనున్న బాహుబలి టీం

ప్రీ ప్రొడక్షన్ పూర్తిచేయనున్న బాహుబలి టీం

Published on May 27, 2013 8:23 AM IST

Bahubali

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించనున్న ‘బాహుబలి’ షూటింగ్ కోసం సిద్దమవుతున్నారు. ఈ చిత్ర టీం కొన్ని నెలలుగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై పని చేస్తున్నారు. వీరు సినిమాలోని చిన్న చిన్న విషయాలపై కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇంకా చాలా మంది స్టార్ నటీనటులు ఉండే అవకాశం ఉంది. వారి వివరాలు త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది.

మరి కొన్ని వారాల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్, రానా, అనుష్కలు గత కొద్ది రోజులుగా కత్తి యుద్ధం, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. ఆర్కా మీడియా బ్యానర్ వారు ఈ సినిమాని నిర్మించనున్నారు.

తాజా వార్తలు