ప్రభాస్ కు ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్న బాహుబలి బృందం

ప్రభాస్ కు ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్న బాహుబలి బృందం

Published on Oct 18, 2013 8:42 AM IST

prabhas
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి అభిమాన గణం భారీ సంఖ్యలోవుంది . తెలుగు సినిమాకు సంబంధించిన అగ్ర తారలలో ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం ప్రభాస్ రాజమౌళి తో కలిసి ‘బాహుబలి’ సినిమాను తెరకెక్కించే పనిలో వున్నాడు.
ఈ ఆరడుగుల యోధుని పుట్టినరోజు త్వరలో రానుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఫాన్స్ కు బాహుబలి బృందం ఒక సర్ప్రైస్ ను ఇవ్వనున్నారు. ఈ అక్టోబర్ 23 న అభిమానులకు ఒక స్పెషల్ వీడియో ను బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ వీడియోలో బాహుబలి వస్త్రాల ప్రదర్శన వుంటుందని అంచనా
ఈ చారిత్రాత్మక చిత్రంలో ప్రభాస్ తమ్ముడిగా రానా కనిపించనున్నాడు. అనుష్క హీరోయిన్. అర్క మీడియా సంస్థ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తుంది

తాజా వార్తలు