పుకార్లను ఖండించిన బాహుబలి బృందం

పుకార్లను ఖండించిన బాహుబలి బృందం

Published on Nov 10, 2013 5:00 AM IST

prabhas-in-bahubali
తెలుగు సినిమాకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి సినిమాని ప్రేక్షకుల అంచనాలకు చేరువయ్యే విధంగా తెరకెక్కించాలన్న తపనతో ప్రతీ చిన్న అంశం మీధా దృష్టి పెడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతుంది

ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్లు ఈమధ్య విడుదలై భారీ రీతిలో లైక్ లు సాధించడమే కాక ప్రశంసలు పొంది సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. కాకపోతే ఈ సినిమా విషయంలో అనేక పుకార్లు వస్తున్నాయి.తాజాగా ఈ చిత్రంలో ఒక రాకుమారిగా ప్రణీతను సంప్రదించారని వార్త వచ్చింది. అయితే ఈ వార్త కేవలం పుకారు మాత్రమే అని చిత్ర బృందం స్పష్టం చేశారు.

ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క మరియు రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకుడు. రాజమౌళి ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ సినిమాను ప్రసాద్ దేవినేని మరియు శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు

తాజా వార్తలు