ఈ రోజే బాద్షా హెక్సా ప్లాటినం డిస్క్ వేడుక

ఈ రోజే బాద్షా హెక్సా ప్లాటినం డిస్క్ వేడుక

Published on Apr 2, 2013 8:15 AM IST

Baadshah5
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఏప్రిల్ 5న విడుదల కానుంది. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, నవదీప్ ఓ నెగటివ్ పాత్రలో కనిపించనున్నాడు. వీళ్ళు కాకుండా కమెడియన్స్ బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బండ్ల గణేష్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకి ఎస్.ఎస్ థమన్ అందించిన ఆడియో సూపర్ హిట్ అయిన సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఈ రోజు హైదరాబాద్లో హెక్సా ప్లాటినం డిస్క్ వేడుకను జరుపుకోనుంది.

‘బంతిపూల జానకి’, ‘డైమండ్ గర్ల్’, ‘బాద్షా టైటిల్ ట్రాక్’, ‘సైరో సైరో’ పాటలు సినీ ప్రేమికులని, అలాగే ఎన్.టి.ఆర్ అభిమానులని అమితంగా ఆకట్టుకున్నాయి. ఎన్.టి.ఆర్ కెరీర్లో ‘బాద్షా’ భారీ బడ్జెట్ చిత్రం, అలాగే ఇదివరకూ ఏ ఎన్.టి.ఆర్ సినిమా రిలీజ్ కానంత విధంగా ఓవర్సీస్ లో విడుదలవుతోంది. యు.ఎస్. యు.కె, కెనెడా, జర్మని, గల్ఫ్, ఆస్ట్రేలియా తో కలుపుకొని మొత్తంగా 216 సెంటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది.

తాజా వార్తలు