ఎన్టీఆర్ రాబోతున్న చిత్రం “బాద్ షా” చిత్రం చివరి షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ లో ఈ మధ్యనే మొదలు పెట్టుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలలో కాజల్ మరియు ఎన్టీఆర్ తో పాటు బ్రహ్మానందం,వెన్నెల కిషోర్, చంద్రమోహన్,రమేష్ మరియు భరత్ లు పాల్గొంటున్నారు . ఈ చిత్రం ఫిబ్రవరి మొదట్లో చిత్రీకరణ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలను మొదలుపెట్టుకోనుంది. ఈ చిత్ర ఆడియో మార్చ్ 10న విడుదల కానుంది అని ఇప్పటికే బండ్ల గణేష్ తెలిపారు. ఏప్రిల్ 5న చిత్రాన్ని భారీగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. కోన వెంకట్ మరియు గోపి మోహన్ స్క్రిప్ట్ అందించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు.