వచ్చే ఏడాది వేసవిలో బాద్షా

వచ్చే ఏడాది వేసవిలో బాద్షా

Published on Oct 1, 2012 5:29 PM IST


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘బాద్షా’ చిత్రం ముందు అనుకున్నట్టుగా 2013 సంక్రాంతికి రావటంలేదని మరియు జనవరి తర్వాత ఈ చిత్రం విడుదల కానుందని కొన్ని రోజుల క్రితం మేము తెలిపాము. ఇప్పుడు ఆ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ అధికారికంగా తెలియజేశారు, అలాగే ‘బాద్షా’ 2013 మార్చ్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. మామూలుగా మార్చ్ నుండి టాలీవుడ్ సమ్మర్ మూవీల సినిమా విడుదలలు ప్రారంభమవుతాయి.

ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంలో భారీ ఎత్తున కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ మరియు గోపి మోహన్ కథను అందించారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు