పశ్చిమ గోదావరిలోనూ భారీ రేటు పలికిన బాద్షా

పశ్చిమ గోదావరిలోనూ భారీ రేటు పలికిన బాద్షా

Published on Jan 31, 2013 12:40 PM IST

Baadshah

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్షా’ సినిమాపై సినిమా ప్రేమికులకు భారీ అంచనాలున్నాయి. రిలీజ్ కి ముందే ఈ సినిమా 50 కోట్ల బిజినెస్ చేసిందని మేము ఇదివరకే తెలియజేశాము. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమా రైట్స్ సుమారు 2.66 కోట్లకి అమ్ముడు పోయాయి. ఈ ఏరియాలో ఇంత భారీ మొత్తానికి అమ్ముడు పోయి రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం నాగార్జున సాగర్ ఏరియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పలు విభిన్న గెటప్స్ లో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్ నెగటివ్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు