నాగ చైతన్య మరియు సమంత ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “ఆటోనగర్ సూర్య” చిత్రీకరణ చివరి దశలో ఉంది. దేవ్ కట్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కే అచ్చిరెడ్డి మాక్స్ ఇండియా బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్ర బృందంతో సమంత జూలై 20న చేరవలసి ఉండగా తను చిత్రీకరణలో పాల్గొనలేదని సమాచారం. ఇదిలా ఉండగా దేవ కట్ట ఈ చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉందని దృవీకరించారు. “ఆటోనగర్ సూర్య” చిత్రంలో మూడు రోజులు టాకీ మరియు రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి అని దేవకట్ట ట్విట్టర్లో తెలిపారు. ఈ రెండు పాటల్లో ఒకటి నాగ చైతన్య మరియు సమంతల మీద సెప్టెంబర్ లో చిత్రీకరించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం అక్టోబర్ లో విడుదల అవుతుంది.