అక్షయ్ కుమార్ మరియు ధనుష్ హీరోలుగా ఓ బైలింగ్వల్ మల్టీ స్టార్ ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రంలో స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ ధనుష్ కి జంటగా నటిస్తుంది. అట్రాంగి రే అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకత్వం ఆనంద్ ఎల్ రాయ్ వహిస్తున్నారు. కాగా ఆయన ఓ లీడింగ్ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ చిత్రానికి సంబంధించిన కొన్నిఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అట్రాంగి రే చిత్ర షూటింగ్ వచ్చే నెల నుండి మొదలుకానుందట. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ బీహార్ మరియు మధుర ప్రాంతాలలో చిత్రీకరిస్తారట. ఇక అక్షయ్ కుమార్ ఏప్రిల్ లో షూటింగ్ లో జాయిన్ అవుతారట. 2020 జులై చివరికల్లా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయనున్నారట. ఇక ఈ చిత్రం హిందీ మరియు తమిళంలో విడుదల కానుంది. ఈ చిత్రంతో సారా అలీ ఖాన్ సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.