సౌత్ సినిమాలపై కన్నేసిన ఆసిన్

సౌత్ సినిమాలపై కన్నేసిన ఆసిన్

Published on May 25, 2013 6:40 PM IST

Asin

గత కొన్నాళ్లుగా ఆశిన్ బాలీవుడ్లో పాగా వేసింది. కానీ ‘కిలాడీ 786’ సినిమా తరువాత ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ భామ దక్షిణాది సినిమాల స్క్రిప్ట్లు వినే పనిలో బిజీగా వుండట. అంతేకాక వాటిల్లో ఒకటి రెండు సినిమాలు కుడా అంగీకరించిందట. మలయాళం సినిమాలతో తన సినిమాలను ప్రారంబించిన ఆసిన్ ఇక్కడ పెద్ద హీరోలతో నటించి అగ్రతారగా వెలిగింది. బాలీవుడ్లో ‘గజిని’ సినిమాలో నటించిన ఆమె ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా స్టార్ అయిపొయి మరిన్ని హిందీ సినిమాలను చేజిక్కించుకుంది.ప్రస్తుతం ఆసిన్ సౌత్ సినిమాల మీద దృష్టిపెట్టింది కనుక ఈ అందాల తార తెలుగులో త్వరలో మరొకసారి మెరవాలని కోరుకుందాం

తాజా వార్తలు