‘అర్జున్ రెడ్డి’ రీమేక్ హిందీలో కూడా భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో.. తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్100′, ఓ బేబీ’ చిత్రాల రైట్స్ ను ఇప్పటికే బాలీవుడ్ నిర్మాతలు కొనేశారు. అలాగే భీష్మ చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు… బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అర్జున్ కపూర్ హీరోగా ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నారట. రణబీర్ కపూర్ ఇప్పటికే వరుస సినిమాలకు కమిట్ అవ్వడం.. పైగా భీష్మ స్క్రిప్ట్ అర్జున్ కపూర్ కి బాగుంటుందనే ఫీల్ రావడంతో కరుణ్ జోహార్, అర్జున్ కపూర్ ను హీరోగా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట.
భీష్మ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమాకు ఓవర్శిస్ తో పాటు తెలుగు రాష్ట్రాల అన్ని కేంద్రాల్లో భారీ కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఈ సినిమా రెట్టింపు లాభాలనుసొంతం చేసుకుంది. మొత్తానికి, హీరో నితిన్ కి కూడా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. మరి ఈ సినిమా అర్జున్ కపూర్ కి కూడా సూపర్ హిట్ ని ఇస్తుందా..? అలాగే నితిన్ చేసిన పాత్రలో అర్జున్ కపూర్ ఎలా నటిస్తాడో చూడాలి. అన్నట్ల ఈ మధ్య ఇక్కడ సూపర్ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు.