తన అందాలతో ఫేట్ ని టెస్ట్ చేసుకోనున్న అర్చన

తన అందాలతో ఫేట్ ని టెస్ట్ చేసుకోనున్న అర్చన

Published on Oct 9, 2012 4:05 PM IST


“మైక్ టెస్టింగ్ 143” చిత్రంతో అర్చన(వేద) తన అందాలతో ప్రేక్షకులకు మత్తెక్కించబోతుంది. తారకరత్న మరియు మదాలస శర్మ ప్రధాన పాత్రలలో రానున్న ఈ చిత్రంలో ఆమె ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో నాటకాలను ఇష్టపడే దయానంద్ పాత్రలో తారకరత్న కనిపించనున్నారు. ఈ చిత్రానికి కే వీరు దర్శకత్వం వహిస్తున్నారు, హీరో కృష్ణుడు ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్ర నిర్మాత కే రాజ మాట్లాడుతూ ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని తారకరత్న నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. త్వరలో బ్యాంకాక్లో రెండు పాటలను చిత్రీకరించనున్నామని, ఆడియో మరియు చిత్రాన్ని నవంబర్లో విడుదల చేస్తామని కూడా అన్నారు. సుమన్, నరేష్,షాయాజీ షిండే మరియు వేణు మాధవ్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం అయినా బాక్స్ ఆఫీస్ వద్ద తారకరత్నకి విజయం సాదించి పెడుతుందేమో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు