మగధీర చూసి చరణ్ ని ఫిక్స్ అయిన అపూర్వ లఖియా

మగధీర చూసి చరణ్ ని ఫిక్స్ అయిన అపూర్వ లఖియా

Published on Sep 3, 2013 1:05 PM IST

Ram-Charana-and-Apoorva-Lak
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సినిమా ‘జంజీర్’. తెలుగులో ‘తుఫాన్’ గా వస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ అపూర్వ లఖియాని బాలీవుడ్ లో అంతమంది హీరోలు ఉంటే రామ్ చరణ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అడిగితే ‘ మీ చెప్పినట్లు బాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు, కానీ యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలు చేయగల హీరోలు మాత్రం చాలా తక్కవ. ‘జంజీర్’ కథ రెడీ అయ్యాక హీరో కోసం అన్వేషిస్తున్న టైంలో అనుకోకుండా ‘మగధీర’ సినిమా చూసాను. ఆ మూవీలో రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్ లో చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడే జంజీర్ కి రామ్ చరణ్ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యానని’ అపూర్వ లఖియా సమాధానం ఇచ్చాడు.

ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీ హరి షేర్ ఖాన్ పాత్రలో కనిపించనున్నాడు. తుఫాన్ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ – పునీత్ ప్రకాష్ మెహ్రా, సుమీత్ ప్రకాష్ మెహ్రా – ఫ్లైయింగ్ టర్టల్ ఫిల్మ్స్ వారు కలిసి నిర్మించారు.

తాజా వార్తలు