ఈ వారం బాక్సాఫీస్ దగ్గర రెండు బడా చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్ 2’ చిత్రం యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఆగస్టు 14 నుండి 23వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ పెంపుతో హీరో ఎన్టీఆర్ తాజాగా ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు.
అటు రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ కూడా భారీ అంచనాలతో రానుంది. ఈ చిత్రానికి కూడా ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకి అనుమతిచ్చింది. రిలీజ్ రోజు ఉదయం 5 గంటల అదనపు షో తో పాటు.. ఆగస్టు 14 నుంచి పదిరోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 మేర టికెట్ రేట్లు పెంచుకోవచ్చని జీవో జారీ చేసింది.