‘రాధే బన్సీ’ షార్ట్ ఫిల్మ్ ని విడుదల చేసిన అనసూయ

కొత్తతరం సినిమా లవర్స్ కలిసి తెరకెక్కించిన ‘రాధే బన్సీ’ లఘు చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా యాంకర్, ప్రముఖ నటి అనసూయ విడుదల చేశారు. రిలేషన్ షిప్ ఎండింగ్ మూమెంట్ మీద ఎమోషనల్ గా రూపొందిన ఈ సినిమాను వినయ్ వివేక వర్ధన్ అనే యువకుడు డైరెక్ట్ చేశాడు.

ఈ లఘు చిత్రంలో శైలేష్ సన్నీ, రమ్య హీరో హీరోయిన్స్ గా నటించారు. ఐరా ఫిలిమ్స్ బ్యానర్ పై సీత మాచినేని నిర్మించిన ఈ షార్ట్ ఫిలింకు వంశీ కృష్ణ కీస్ సంగీతం అందించాడు. త్వరలోనే ఈ బ్యానర్ పై మరిన్ని లఘు చిత్రాలతో పాటు ఫీచర్ ఫిలిమ్స్ కూడా రానున్నాయని నిర్మాత తెలిపారు.

ప్రస్తుతం యంగ్ టీమ్ అందరూ కలిసి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ అందరినీ ఆకట్టుకుంటూ అలరిస్తుంది.

Exit mobile version